దాట్ల దేవదానంరాజు |
-దాట్ల దేవదానం రాజు,
పేజీలు: 168,
ధర: రూ.100,
ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048,
ఉదయిని, జక్రియానగర్, యానాం- 533 464
మట్టికి ఉనికి ఉంటుంది... ఊపిరి ఉంటుంది. పరిస్థితుల రాపిడికి అందులోని రేణువుల్లో విస్ఫోటనం సంభవిస్తుంది. అప్పుడు తిరుగుబాట్లు జరుగుతాయి. వాటిని అణగదొక్కడానికి ఇనుపనాడాల బూట్లు కదం తొక్కుతాయి. విజయాలూ... వీర స్వర్గాలూ... తిరోగమనాలూ నమోదవుతాయి. మట్టిలో కలలుంటాయి..కలతలూ...కన్నీళ్లూ-ఇవన్నీ కలబోసిన జీవితాలూ ప్రతీ పొరలోనూ తారసిల్లుతాయి. మనిషీ మట్టీ వేరు కాదు. నిజానికి మనిషికి మట్టే వేరు! అందుకే మట్టి మూలాల్ని అనే్వషిస్తే కావలసినన్ని కథలు దొరుకుతాయి. చూడ్డానికి మట్టి ఒకేలా కనిపిస్తుందేమో గానీ మట్టి మట్టికీ తేడా ఉంది. దేని నేపథ్యం దానికి ఉంది. అందుకే మట్టిని ప్రేమించి..మట్టికి నమస్కరించి ఎవరు ఎన్ని కథలు రాసినా మనసు పెట్టి చదివే వారికి- ‘అమరావతి కథలు’, ‘్భట్టిప్రోలు కథలు’ లాగా దాట్ల దేవదానం రాజు గారి ‘యానాం కథలు’ కూడా తప్పకుండా నచ్చుతాయి.
భౌగోళికంగాను, భాష, యాస, సంస్కృతుల పరంగానూ యానాం గోదావరి మండలానికి చెందినట్లే కనిపించినా అది ఒకప్పటి ఫ్రెంచి వలస రాజ్యానికి చెందడం, నేటికీ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగడం లాంటి కారణాలవల్ల ఆ మట్టిలో, మనుషుల జీవిత నేపథ్యాల్లో ఓ ప్రత్యేకత ఉట్టిపడుతుంది. అది సమూహంలోని ఏకాకితనం లాంటిది. దాన్ని సరిగ్గా ఒడిసిపట్టి కథలుగా ఆవిష్కరించడంలో దేవదానం రాజుగారి పనితనం ఈ సంపుటిలో కనిపిస్తుంది. ఏ ఊళ్లోనైనా జరగడానికి ఆస్కారమున్న కథలు అక్కడక్కడా కనిపించినా, కేవలం యానాం మాత్రమే నేపథ్యంగా ఉండితీరాల్సిన కథలు ఇందులో చాలా ఉన్నాయి. వలస రాజ్యంలో భాగంగా ఉన్నప్పటివి మొదలుకుని భారతదేశంలో విలీనం అయిన తర్వాతివి వరకు రకరకాల కథలిందులో ఉన్నాయి. అలాగే వర్తమాన పరిస్థితుల్లో కథను ఎత్తుకుని, గతంలోకి తీసుకువెళ్లినవీ, నాటి...ఈనాటి పరిస్థితుల మధ్య వైరుధ్యాల్నీ, డోలాయమాన స్థితినీ సాధికారికంగా చిత్రించినవీ చక్కని కథలున్నాయి.
ముఖ్యంగా ‘ఫ్రెంచ్ ఏలుబడి నేపథ్యంగా మలిచిన కథలైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘పతాక సందేశం’, ‘కథోర్ జియ్’, ‘తీర్పు వెనుక’, ‘లా’మూర్, ‘ఒప్సియం’ లాంటి కథలు చదువుతున్నప్పుడు మృణాల్‌సేన్, శ్యాంబెనగల్ లాంటి దర్శకుల చిత్రాల శైలి స్ఫురిస్తుంది. చరిత్రతో మొదలుపెట్టి, నడిమి కాలాన్ని దాటుకుని ఇప్పటి ఆక్వా కల్చర్ (‘నీలి వల’) వరకు రచయిత యానాంని 360 డిగ్రీల్లో సందర్శింప చేయడం ఈ సంపుటి తాలూకు ప్రత్యేకత. చాలా కథల్లో కవిత్వ శైలి అందంగా ఒదిగింది. (‘చిట్లిన దిగులు’ కథ పేరులోనే కవిత్వం ఉంది). చదువుతున్నంత సేపూ ఒక ప్రత్యేక పరిస్థితుల్లోకి తీసుకువెళ్లే ‘యానాం కథలు’ తప్పకుండా చదివిస్తాయి. రచయిత అభినందనీయుడు.
వలస రాజ్యంలో మొలిచిన గోదావరి నేపథ్యాలు (ఆంధ్రభూమి )
-ఓలేటి శ్రీనివాస భాను 23/12/2012
ఆకట్టుకున్న ఇష్టాగోష్ఠి
సాహితీ చర్చతో పులకించిన 'కథాయానాం'
దాట్ల దేవదానంరాజు తొలి పలుకులు.. |
యానాం, న్యూస్‌టుడే: వృద్ధగౌతమీ గోదావరి మురిసిపోయింది. తెలుగు సాహితీరంగంలో లబ్దప్రతిష్టులైన అనేకమంది కథకులు, కవులతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన 'కథాయానాం' తెలుగు కథ-కమామిషు ఇష్టాగోష్టి శుద్ధసావేరీ బోటులో యానాం గోదావరిలో అర్ధవంతగా సాగింది.
యానాం కవి, కథారచయిత దాట్ల దేవదానంరాజు ఆధ్వర్యంలోని స్ఫూర్తి సాహితీ సమాఖ్య, కవి శిఖామణి హైదరాబాద్ కవిసంధ్య ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గోదావరి అలలపై సాహితీ తరంగాలను వినిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 80 మంది కథారచయితలు, కవులు వారి కుటుంబసభ్యులతో నదీవిహారం ఎంతో ఆనందంగా సాగింది.
బోటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వేదికపై సాహిత్యరంగంలో ప్రతిభావంతులైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, నవ్య సంపాదకుడు జగన్నాథశర్మ, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్‌బాబు, స్కైబాబా వంటి అనేకమంది ప్రముఖులు తెలుగు సాహితీరంగం తీరుతెన్నులపై చర్చించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తన జీవితకాలపు కల అని, ఇంతమంది సాహితీప్రముఖులను ఒక్కచోటికి చేర్చడం తనకు చాలా ఆనందంగా ఉందని దాట్ల దేవదానం రాజు అన్నారు. ఈ సందర్భంగా తెలుగు కథ సాగుతున్న తీరుపై లోతైన చర్చ చేశారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే..
యానాం కవి, కథారచయిత దాట్ల దేవదానంరాజు ఆధ్వర్యంలోని స్ఫూర్తి సాహితీ సమాఖ్య, కవి శిఖామణి హైదరాబాద్ కవిసంధ్య ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గోదావరి అలలపై సాహితీ తరంగాలను వినిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 80 మంది కథారచయితలు, కవులు వారి కుటుంబసభ్యులతో నదీవిహారం ఎంతో ఆనందంగా సాగింది.
బోటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వేదికపై సాహిత్యరంగంలో ప్రతిభావంతులైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, నవ్య సంపాదకుడు జగన్నాథశర్మ, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్‌బాబు, స్కైబాబా వంటి అనేకమంది ప్రముఖులు తెలుగు సాహితీరంగం తీరుతెన్నులపై చర్చించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తన జీవితకాలపు కల అని, ఇంతమంది సాహితీప్రముఖులను ఒక్కచోటికి చేర్చడం తనకు చాలా ఆనందంగా ఉందని దాట్ల దేవదానం రాజు అన్నారు. ఈ సందర్భంగా తెలుగు కథ సాగుతున్న తీరుపై లోతైన చర్చ చేశారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే..
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు గతకాలం వారికే కాక ప్రస్తుత కాలానికి కూడా స్ఫూర్తిదాయకాలని రచయితలు అంశాలను నిత్యనూతనంగా చెప్పగలగాలని అపుడే అవి చిరకాలం నిలవగలుగుతాయన్నారు........కుప్పిలి పద్మ
.........................
కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి...
నేటి కవులు వాస్తవ పరిస్థితుల్ని స్వీకరించి రాయలేకపోతున్నారనడం వాస్తవం కాదు. కథా సాహిత్యం ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సంఘటనలపై స్పందించి కవితలు రాయడం కన్నా వాటిని పూర్తిగా శోధించి కథగా రాయడం సమంజసమనిపిస్తుంది.
నేటి కవులు వాస్తవ పరిస్థితుల్ని స్వీకరించి రాయలేకపోతున్నారనడం వాస్తవం కాదు. కథా సాహిత్యం ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సంఘటనలపై స్పందించి కవితలు రాయడం కన్నా వాటిని పూర్తిగా శోధించి కథగా రాయడం సమంజసమనిపిస్తుంది.
-కె.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు
....................
మన అక్షరం శాశ్వతం...
తెలుగు కథ ఎంతో అద్భుతమైనది. మన కథ సుసంపన్నమైనది. ప్రతి రచయిత తనకు నచ్చిన అంశాన్నే కథగా రాయాలి. ఎవరి జీవితానుభవాల్ని వారు అక్షరబద్ధం చేస్తే మంచి కథలు పుట్టుకొస్తాయి. మనం కాదు.. మన అక్షరం శాశ్వతం.
....................
తెలుగు కథ ఎంతో అద్భుతమైనది. మన కథ సుసంపన్నమైనది. ప్రతి రచయిత తనకు నచ్చిన అంశాన్నే కథగా రాయాలి. ఎవరి జీవితానుభవాల్ని వారు అక్షరబద్ధం చేస్తే మంచి కథలు పుట్టుకొస్తాయి. మనం కాదు.. మన అక్షరం శాశ్వతం.
-జగన్నాథశర్మ, నవ్య సంపాదకుడు
..................
కొత్త జవసత్వాలు నింపాలి..
చదువరులు తగ్గి చూపరులు పెరిగిపోతున్న ఈ తరుణంలో కథను కొత్తదనంతో ముందుకు తీసుకెళ్లాలి. ధన ప్రభావంతో విద్యావంతులు చేతులు కట్టుకొని నిలబడిపోతున్నారు. సమాజం క్షీణస్థితికి వెళుతున్న ఈ తరుణంలో సాహిత్యాన్ని నిలుపుకోవడానికి అంతా ప్రయత్నించాలి.
..................
చదువరులు తగ్గి చూపరులు పెరిగిపోతున్న ఈ తరుణంలో కథను కొత్తదనంతో ముందుకు తీసుకెళ్లాలి. ధన ప్రభావంతో విద్యావంతులు చేతులు కట్టుకొని నిలబడిపోతున్నారు. సమాజం క్షీణస్థితికి వెళుతున్న ఈ తరుణంలో సాహిత్యాన్ని నిలుపుకోవడానికి అంతా ప్రయత్నించాలి.
-రామతీర్థ
...............
ప్రపంచీకరణ ప్రభావం కధారచయితలపైనా పడుతోంది
ప్రపంచీకరణ భూతం ఇప్పుడు రచయితలను తమ అభిప్రాయాలు నిర్భయంగా చెప్పనీయని స్థితికి తీసుకెళుతోంది. ఒకప్పుడు ప్రకృతి మనదిగా భావించిన మనకు ఈ నది, ఇసుక, కొండలు, ుట్టలు, అడవి మనవికావనే భావనలోకి పాలకుల నిర్ణయాలు తీసుకుపోతున్నాయి. మూలవాసులైన స్థానికులకు దారిద్య్రం మాత్రమే మిగులుతోంది.
...............
ప్రపంచీకరణ భూతం ఇప్పుడు రచయితలను తమ అభిప్రాయాలు నిర్భయంగా చెప్పనీయని స్థితికి తీసుకెళుతోంది. ఒకప్పుడు ప్రకృతి మనదిగా భావించిన మనకు ఈ నది, ఇసుక, కొండలు, ుట్టలు, అడవి మనవికావనే భావనలోకి పాలకుల నిర్ణయాలు తీసుకుపోతున్నాయి. మూలవాసులైన స్థానికులకు దారిద్య్రం మాత్రమే మిగులుతోంది.
-అప్పలనాయుడు
....................
కర్తవ్యం తెలుసుకోవాలి..
వర్ధమాన రచయితలు తమగోడును కాక ప్రజల భావాలను తమ కథల్లో ప్రతిఫలింపచేయాలి. సమాజంలోని అట్టడుగు వర్గాలపై తమ ప్రభావం చూపేలా కథలు, కవితలు ఉండాలి. .......డాక్టర్ ఎండ్లూరి సుధాకర్
....................
వర్ధమాన రచయితలు తమగోడును కాక ప్రజల భావాలను తమ కథల్లో ప్రతిఫలింపచేయాలి. సమాజంలోని అట్టడుగు వర్గాలపై తమ ప్రభావం చూపేలా కథలు, కవితలు ఉండాలి. .......డాక్టర్ ఎండ్లూరి సుధాకర్
Literary ride on Godavari
It is not just a sail into the Godavari, but into the
world of Telugu literature. ‘Kathayanam,’ a boat cruise organised by
writer and poet Datla Devadanam Raju here on Saturday, touched upon
various issues pertaining to contemporary Telugu literature with special
focus on short story.
‘Suddha Saveri,’ a houseboat
with 100 writers and poets on its board left Yanam in the afternoon to
sail into the sea mouth. As the boat was moving majestically on the
placid waters of the Godavari, a literary discussion was going on inside
the boat. As a prelude to the release of ‘Yanam Kathalu,’ a compilation
of 18 short stories penned by him, Mr. Devadanam Raju arranged the
literary expedition.
Attada Appala Naidu, a writer
from Srikakulam , who began the discussion on short stories, said
writers from Uttarandhra were drawing inspiration from the citizens’
movements against power plants and rapid industrialisation. Sky Baba
felt that writers from Telangana region were unable to record the
movement in the form of stories, as they were being associated with the
movement emotionally.
Mohammed Khadir Babu said such
conferences would make young writers aware of the challenges in story
writing. Writer Ramateerdha observed that of late there had been a
steady increase in nostalgic stories in Telugu literature, as more and
more writers were evincing interest in going down the memory lane.
D.S.N.
Murthy said there was a need to separate movements from literature.
A.S. Jagannadha Sarma said there was an increase in the contribution of
young writers to the Telugu literature.
Editor of
Andhra Jyothi Telugu daily K. Srinivas hoped that many more stories on
the Godavari in Telangana region would be published in the days to come.
Kuppili Padma said Telugu short story was enjoying democracy and
stories on various subjects were being published.
Vadrevu Veeralakshmi Devi, Chandrasekhar Azad, Sikhamani, Endluri Sudhakar and others participated in the discussion.
The
cruise ‘Kathayanam,’ on river Godavari with 100 writers and poets,
touches issues pertaining to contemporary Telugu literature with special
focus on the short story
..................
..................
Cruising for inspiration
FRIDAY REVIEW, November 16, 2012
In focus Writer-poet Devadanam Raju conducted an innovative workshop for Telugu short-story writers.
River cruise on the Godavari during the full-moon is
apparently a long cherished dream for many. But, Telugu writer and poet
Datla Devadanam Raju dreamt differently. Taking all the writers and
poets from different parts of the State to the river cruise and
convening a workshop on Telugu short-story is what he dreamt for many
years and realised it last week.
A resident of Union
Enclave Yanam, Devadanam Raju has arranged a workshop titled
‘Kathayanam’ on the board of houseboat ‘Suddha Saveri’ in the Godavari.
The occasion is the release of
Yanam Kathalu
, a compilation of 18 short stories penned by Devadanam Raju, for which
he invited over 100 writers and poets from different parts of the State.
During
the four-hour long expedition, contemporary trends in Telugu literature
have been discussed at length. From senior writers to magazine editors
and connoisseurs of prose and poetry formed part of the select gathering
that enjoyed the cruise and the literary discussions as well.
Evaluation of short-story in Telugu, contemporary trends, difference
between newspaper articles and short-stories, literary criticism and
gender, regional and existence related issues in the contemporary
literature remained the hot topics.
On the sidelines
of the discussions, artiste Akbar has done portraits for the
short-stories by using oil colours. His nimble fingers have turned the
art sheets into beautiful portraits within minutes, even as the
discussions are going on and the participants are watching his work
curiously. Attada Appala Naidu, Kuppili Padma, Ramateerdha, Md. Khadeer
Babu, Sky Baba, A.S. Jagannadha Sarma, K. Srinivas, Aluru Vijayalakshmi,
Vadrevu Veeralakshmi Devi, K.N. Malleeswari, Chandrasekhar Azad, R.L.
Swamy, Sikhamani, Endluri Sudhakar, D.S.N. Murthy, Dwana Sastry,
Srikantha Spoorthy and others participated in the literary
deliberations.
Devadanam Raju says he has penned
prose and poetry in the last three decades and published several books.
“While collecting data for my work
Yanam Charitra
, an idea flashed in my mind that I could write stories with Yanam
backdrop. I discussed this idea with my film director friend Vamsy, who
got inspired by this and penned
Maa Pasalapoodi Kathalu
. But, it took so many years for me to come out with this compilation,
as my focus has been shifted to poetry of late,” he explains.
బోటులో సాహితీ ప్రముఖులు.. |
సాహితీ ప్రముఖులు.. |
సాహితీ ప్రముఖులు.. |
బోటులో సాహితీ ప్రముఖులు.. |
సాహితీ ప్రముఖులు.. |
బోటులో సాహితీ ప్రముఖులు.. |
‘నవ్య’ సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ, ‘ఆంధ్రజ్యోతి’సంపాదకులు కె.శ్రీనివాస్ లతో.. దాట్ల దేవదానంరాజు |
దాట్ల దేవదానంరాజు |
స్వాగతం పలుకుతున్న... మధునాపంతుల |
కధకుల ఇష్టాగోష్టి నిర్వహిస్తున్న.. కుప్పిలి పద్మ |
కధకుల ఇష్టాగోష్టిలో... అట్టాడ అప్పలనాయుడు |
కధకుల ఇష్టాగోష్టిలో పాల్గొన్న.... స్కైబాబా, మహ్మద్ ఖదీర్ బాబు, రామతీర్ధ |
కధకుల ఇష్టాగోష్టిలో... అట్టాడ అప్పలనాయుడు, కుప్పిలి పద్మ,స్కైబాబా, మహ్మద్ ఖదీర్ బాబు, రామతీర్ధ |
సాహితీ ప్రముఖులు. |
కధకుల ఇష్టాగోష్టిలో...స్కైబాబా |
కధకుల ఇష్టాగోష్టిలో రామతీర్ధ |
ఇష్టాగోష్టిలో...మహ్మద్ ఖదీర్ బాబు |
కధకుల ఇష్టాగోష్టిలో రామతీర్ధ, కుప్పిలి మ్పద్మ, స్కైబాబా |
కధకుల ఇష్టాగోష్టిలో...‘ఆంధ్రజ్యోతి’సంపాదకులు కె. శ్రీనివాస్ |
‘ఆంధ్రజ్యోతి’సంపాదకులు కె. శ్రీనివాస్ |
‘ఆంధ్రజ్యోతి’సంపాదకులు కె. శ్రీనివాస్ |
కధకుల ఇష్టాగోష్టిలో...‘నవ్య’ సంపాదకులు ‘నవ్య’ సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
కధకుల ఇష్టాగోష్టిలో...‘నవ్య’ సంపాదకులు ‘నవ్య’ సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
కధకుల ఇష్టాగోష్టిలో...డాక్టర్ ఆలూరి విజయ లక్ష్మి |
కధకుల ఇష్టాగోష్టిలో...వాడ్రేవు వీరలక్ష్మీ దేవి |
వేదికపై చిత్రాలు గీస్తున్న అక్బర్ |
కధకుల ఇష్టాగోష్టిలో..ఎం.ఎస్.సూర్యనారాయణ |
అప్పటికప్పుడు తాను వేసిన చిత్రాన్ని ప్రదర్శిస్తున్న అక్బర్, దాట్ల దేవదానంరాజు, శశికాంత వర్మ |
కధకుల ఇష్టాగోష్టిలో..అట్లూరి అనిల్ |
కధకుల ఇష్టాగోష్టిలో శ్రీమతి సీతారత్నం |
కధకుల ఇష్టాగోష్టిలో ... ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కుమార్తె మానస |
కధకుల ఇష్టాగోష్టిలో..రామా చంద్రమౌళి |
కధకుల ఇష్టాగోష్టిలో.. మల్లీశ్వరి |
కధకుల ఇష్టాగోష్టిలో ..ఖాదర్ మొహియుద్దీన్ |
కధకుల ఇష్టాగోష్టిలో చంద్రశేఖర్ అజాద్ |
కధకుల ఇష్టాగోష్టిలో ..మాకినీడి సూర్య భాస్కర్ |
కధకుల ఇష్టాగోష్టిలో.....ఎల్.ఆర్.స్వామి |
కధకుల ఇష్టాగోష్టిలో ...ద్వా.నా.శాస్త్రి |
కధకుల ఇష్టాగోష్టిలో ...శ్రీ కంఠస్పూర్తి |
కధకుల ఇష్టాగోష్టిలో ...ఆచార్య ఎండ్లూరి సుధాకర్ |
కధకుల ఇష్టాగోష్టిలో ...ఆచార్య శిఖామణి |
దాట్ల దేవదానంరాజు కృతజ్ఞతా పలుకులు.. |
దాట్ల దేవదానంరాజు |
దాట్ల దేవదానంరాజు |
దాట్ల దేవదానంరాజు ...... |
దాట్ల దేవదానంరాజుతో... కుప్పిలి పద్మ,స్వామి, అక్బర్, మధునాపంతుల |
కుమారులు శశికాంత వర్మ, డి.వి.యస్. రాజులతో.. దాట్ల దేవదానంరాజు |
నదీ ప్రయాణం ముగింపు... |
‘కధాయానాం’ సాహితీనావలో పయనించిన ప్రముఖులు |
‘కధాయానాం’ సాహితీనావలో పయనించిన ప్రముఖులు |
‘యానాంకథలు’ఆవిష్కరణ సభకు స్వాగతం... |
ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు ఆచార్య శిఖామణి... |
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రామా చంద్రమౌళి, రామతీర్ధ, అప్పలనాయుడు, ద్వానా శాస్త్రి, చిరంజీవినీ కుమారి |
‘యానాంకథలు’ఆవిష్కరణ సభ |
దాట్ల దేవదానం రాజు, ఎ.ఎన్.జగన్నాథశర్మ, కె.శ్రీనివాస్, మల్లాడి కృష్ణారావు(యానాం శాసన సభ్యులు),వాడ్రేవు వీరలక్ష్మీ దేవి |
దాట్ల దేవదానం రాజు, ఎ.ఎన్.జగన్నాథశర్మ, కె.శ్రీనివాస్, మల్లాడి కృష్ణారావు(యానాం శాసన సభ్యులు),వాడ్రేవు వీరలక్ష్మీ దేవి |
ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు ఆచార్య శిఖామణి |
ఎండ్లూరి సుధాకర్, దాట్ల దేవదానం రాజు, ఎ.ఎన్.జగన్నాథశర్మ |
ప్రసంగిస్తున్న మల్లాడి కృష్ణారావు (యానాం శాసన సభ్యులు), |
దాట్ల దేవదానం రాజుని సన్మానిస్తున్న మల్లాడి కృష్ణారావు (యానాం శాసన సభ్యులు), ఎండ్లూరి సుధాకర్, ఎ.ఎన్.జగన్నాథశర్మ, కె. శ్రీనివాస్, శిఖామణి |
దాట్ల దేవదానం రాజుని సన్మానిస్తున్న మల్లాడి కృష్ణారావు (యానాం శాసన సభ్యులు), ఎండ్లూరి సుధాకర్,ఎ.ఎన్.జగన్నాథశర్మ, కె. శ్రీనివాస్, శిఖామణి |
‘యానాంకథలు’ఆవిష్కరణ... |
ఒక కవీ, కథకుని గురించి..
- శివారెడ్డి
నిజానికి ఈ కథలు చదవకముందు, దేవదానంరాజుని కథకునిగా పెద్ద impression లేకుండానే చదవటం మొదలెట్టా. ఆయన అంతకుముందు 2002లో అచ్చేసిన 'దేవదానంరాజు కథలు'గానీ, 'సరదాగా కాసేపు' రాజకీయ వ్యంగ్య కథలుగానీ మనసుపెట్టి చదవలేదో ఆయా కాలాల సందర్భాలనుబట్టి అవి నామీద అంత ముద్ర వేయలేదో తెలియదు. కథకుడిగా రాజు విషయంలో నేను చీకట్లో వున్నట్టే- ఏర్పరుచుకోవాల్సిన చనువు ఏర్పరుచుకోలేదనే- దిగాల్సినంత లోతుకు దిగలేదనే; దానికి కారణం ఆయన కవిగా యిచ్చినimpression వేసిన బలమయిన ముద్ర కారణం. దాట్ల దేవదానంరాజంటే కవే- త్వరత్వరగా ఎదిగొచ్చిన కవే- ఆలస్యంగా నాట్లు వేసినా పంట సకాలంలో చేతికొచ్చినట్టే. కాస్త ఆలస్యంగా సాహిత్య రంగప్రవేశం చేసినా- ఆ gap కనపడకుండా విరివిగా సృజన వ్యాసంగం జరిగింది.
ఒక ఆధునిక వ్యక్తీకరణ పట్టుకోవటంలో- అటు భావంలోనూ, యిటు భాషలోనూ సఫలీకృతుడయ్యాడు. ఆలస్యంగా మొదలెట్టినవాళ్ళకు వర్తమానపు వత్తిళ్ళ వల్లా, సంక్లిష్ట సందర్భాల వల్లా వస్తువు పుష్కలంగానే వుంటుంది. ఆ కాలానికనుగుణమయిన ఆధునిక వ్యక్తీకరణ కవసరమయిన భాష సంపాయించుకోవటంలో కొంచెం యిబ్బంది పడాల్సి వస్తుంది. తనదయిన అభివ్యక్తీ, తన భాష తాను సృష్టించుకోలేకపోతే, తనదయిన శైలీ నిర్మాణాలు సాధించటం కష్టమౌతుంది. దేవదానంరాజు ఆ gap కనపడనీయకుండా అటు భాషలోనూ ఇటు భావంలోనూ ఒక అత్యద్భుతమయిన ఆధునిక వ్యక్తీకరణ సాధించాడు. యిది అపూర్వం. తనదయిన కవిత్వ పరిభాష తను ఎన్నుకున్నాడు, సాధించాడు-1954లో పుట్టిన దేవదానంరాజు, మొదటి కవితా సంపుటి 1997 లో అతని 43వ ఏట అచ్చయింది.
అక్కడనుంచి 2012లో అచ్చయిన 'పాఠం పూర్తయ్యాక' అతని ఆరవ కవితా సంపుటి. అలాగే రెండు దీర్ఘ కవితలు రాశాడు. రైతు నేపథ్యం నుంచి ఎత్తుకున్న 'ముద్రబల్ల' 2004, వృద్ధాప్యపు క్లేశాల నేపథ్యం నుంచి వచ్చిన 'నాలుగోపాదం' 2010. అందుకని దేవదానంరాజు కవిగానే కళ్ళముందు మెదులుతాడు. అతను సర్వశక్తులు కేంద్రీకరించింది ఈ దశాబ్దంన్నరలో కవిత్వం మీదే- ఈ పదిహేను సంవత్సరాల్లో తన్నుతాను ఏ రకంగా సన్నద్ధం చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు, మలుచుకున్నాడు- మొక్కవోకుండా- ఎలా నిలబడ్డాడు అన్నదే ముఖ్యం- ఎప్పుడు మొదలుపెడితే మాత్రమేమిటి? ఏ రకంగా పనిచేశావు ఏం సాధించావు అన్నదే ముఖ్యం. కవిగా దేవదానంరాజు అది సాధించాడు- ఖచ్చితంగా పేరు తీసేసి ఒక పద్యమిస్తే యిది దేవదానంరాజు పద్యమని గుర్తుపట్టగలిగిన తనదయిన ఒక ముద్రను సాధించాడు. అందుకని ఈ కథల సంపుటికి నాలుగు మాటలు వ్రాయమన్నప్పుడు నా మానసిక స్థితి ఏమిటి? రాజు కథకుడిగా నాకంతగా ఆనని దశ. అతని అధ్యయనం, సాధనాక్రమమంతా కవిత్వానికి సంబంధించినదేనని. కానీ ఈ కథా సంపుటిలో కథలన్నీ చదివాక మళ్ళా వెనక్కి వెళ్ళి 'దాట్ల దేవదానంరాజు' కథలు మళ్ళీ చదివాక- నా అభిప్రాయం తప్పని తేలింది.
నిజానికి దేవదానంరాజుని సాహిత్య లోకానికి పరిచయం చేసింది, ఈ వచన సాహిత్యమే. అతని సాహిత్యపు orientation అంతా వచన సాహిత్యం ద్వారానే. సాహిత్యం పట్ల అపారమయిన ప్రేమని ఒక లోలుసతనీ పెంచుకున్నదీ వచన రచనలు చదవటం ద్వారానే- 'దేవదానంరాజు కథలు'గానీ, 'యానాం కథలు'గానీ చదువుతుంటే, గొప్ప ఆనందం, ఆశ్చర్యం- నేననుకోవటం కథకుడికి, గొప్ప కథకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం- తనదయిన ఒక -Narrative -అద్భుతమయిన కథాకథన పద్ధతి. మన జానపద మౌఖిక కథకులు సాధించిన కథాకథన పద్ధతి, ఏదో యితనిలో యింకిపోయిందనిపించింది.
రైతాంగపు నేపథ్యం నుంచి వచ్చిన దేవదానంరాజుకివన్నీ కొత్తగాదు. తను కథకునిగా జన్మించాక, ఆ తొలినాళ్ళ రైతుకూలీల కథాకథన పద్ధతిని అందిపుచ్చుకున్నాడనిపించింది. ఆ జానపద కథకులు కథ చెప్పే పద్ధతిలో అంత రుచి ఎందుకు? అంటే- సరాసరి జీవితం నుంచి, జీవనానుభవం నుంచి ఒక చమత్కార భూయిష్టమయిన జాను కవిత్వ శైలిలో వాళ్ళు పలుకుతారు గాబట్టి- ఆ నేర్పేదో, ఆ కౌశలమేదో యితనిలో పరోక్షంగా యింకిపోయింది. ఎంత హాయి గా కథ చెబుతాడు. అతని కవిత్వమూ అంత హాయిగా సరళంగా సాంద్రంగా మన లోపలి వేళ్ళు కదిలిస్తూ-కవి, కథకుడూ- పరస్పర పూరకాలేమో, ప్రేరకాలేమో- కథ రాసేటప్పుడు కవి అంతర్లీనంగా వుంటాడేమో; కథ వింటాడేమో, తనూ వంత పలుకుతాడేమో- అలాగే కవిత్వం రాసేటప్పుడు కథకుడు అదృశ్య పాఠకుడేమో- ఒక కథాకథన స్పర్శ కవిత్వానికిస్తాడేమో- వీళ్ళిద్దరి మధ్యా ఒక అవగాహనా, అవ్యక్త అనుబంధముందేమో- అది చోదకశక్తిగా పనిచేస్తుందేమో- ఆ కెమిస్ట్రీ ఏమిటో, ఆ రసాయనిక చర్య ఏమిటో- మనకు తెలియదుగానీ- పాఠకుణ్ణి లోగొనే ఒక శక్తి, అలా వెంట తీసుకుపోయే ఒక ఆకర్షణ వుంది. అందుకని కథకునిగా రాజు- కవిగా రాజుతో సమానుడే. ఆశ్చర్యం గొలిపే ఒక శైలీ సంవిధానం వుంది- ఆయనదే అయిన ఒక కంఠస్వరం వుంది. దీనికంతకీ నేపథ్యం ఆయన రాయకుండా ఉన్న 40 ఏళ్లలో వుంది. తను పుట్టి పెరిగిన భౌగోళిక జీవన నేపథ్యంలోనూ, తనదే అయిన ఒక అనుభవంలోనూ వుంది.
ఈ కథలన్నింటిలోనూ ప్రత్యక్ష పరోక్షంగా యానాం వెన్నెముక వుంది. యానాం ప్రాణముంది. యానాం గాలి, యానాం వెలుతురు, యానాం పరిమళం వుంది. యానాందే అయిన స్పర్శ వుంది. జీవధార వుంది. ప్రాదేశికత, నిర్దిష్టత- కేంద్రమే. అయినా కవితగానీ కథగానీ అక్కడే నిలవదు. అది, ఆ నిర్దిష్ట సందర్భం నుంచి, సంఘటన నుంచీ, అనుభవం నుంచీ పుడుతుంది, పెరుగుతుంది, విస్తరిల్లుతుంది, క్రమంగా విశ్వమంతా అల్లుకుంటుంది.
'తోడుదీపం' కథని ఒక్క యానాంలోనే ఫిక్స్ చేయలేదు. విశ్వజనీనానుభవం అవుతుంది. సాహిత్యం ఎల్లలు దాటటమంటే యిదే. ముఖ్యమైన మానవ సారాన్నిదేన్నో అది తడుతుంది,మేల్కొల్పుతుం ది. మానవ సంబంధాల్లో వున్న గాఢతని, ఐక్యతని, ప్రేమనీ పంచుకునే తత్వాన్ని అది అద్భుతంగా అందిస్తుంది. ఒక పరిపక్వ దశలో కవిత్వం అందుకున్నాడు, కథనందుకున్నాడు - అతని అధ్యయనం, ఆలోచన, ఆచరణ- అనురాగపు స్పర్శ- అన్నింటినీ సువర్ణంగా మార్చే శక్తినిచ్చింది. తన్ను తాను విమర్శించుకుని, విశ్లేషించుకుని, విభాగించుకుని మళ్లీ ఐక్యం చేసుకునే ఒక విధానాన్ని రాజుగారు తన కవిత్వం ద్వారానూ, కథల ద్వారాను సాధించారనుకుంటా- 'యానాం చరిత్ర'ను రాశాడు- స్థల కాలాల గతాన్ని అధ్యయనం చేశాడు- చరిత్రని పొరలు పొరలుగా వలిచి చూశాడు- చరిత్రని వర్తమానంతో అనుసంధించి వాటి మధ్య సంబంధాన్ని ఒక నిర్మాణ ప్రక్రియగా రికార్డు చేయదల్చి కథలూ, కవితలు రాస్తున్నాడు.
"ఒక కథకుడి జీవితంలోని బయటి పొరల్ని విప్పాల్సి వచ్చినప్పుడు, లోపలి తెరల్ని చీల్చాల్సి వస్తున్నప్పుడే కథ పుడుతుందని నా అభిప్రాయం. అక్షరాన్ని స్వేచ్ఛగా ఎగరేస్తూ మూలాన్ని ప్రతిబింబించటమే కథ చేసే పని అని గుర్తిస్తున్నాను. ఎన్నో జవాబుల్ని రాబట్టుకుని నన్ను నేను సముదాయించుకుంటేనే ఈ కథల్ని రాయగలిగాను.'' దేవదానంరాజు కథకి ముందుమాటలాంటి 'ఒక నేను'లోని వాక్యాలు. ఈ వాక్యాల అర్థాన్ని తర్జుమా చేసుకుంటూ, తను కవిత్వం, కథ రెండూ రాస్తున్నాడనిపిస్తుంది. అతనికి మనఃపూర్వక అభినందనలు-
- శివారెడ్డి
('యానాం కథలు' ముందుమాట)
ప్రసంగిస్తున్న‘ఆంధ్రజ్యొతి’సంపాదకులు కె.శ్రీనివాస్ |
ప్రసంగిస్తున్న‘ఆంధ్రజ్యొతి’సంపాదకులు కె.శ్రీనివాస్ |
ప్రసంగిస్తున్న‘నవ్య’సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
ప్రసంగిస్తున్న వాడ్రేవు వీరలక్ష్మీ దేవి |
‘యానాంకథలు’ఆవిష్కరణసభ...... |
బోటులో సాహితీ ప్రముఖులు.. |
బోటులో సాహితీ ప్రముఖులు.. |
‘ఆంధ్రజ్యోతి’సంపాదకులు కె. శ్రీనివాస్ |
‘నవ్య’సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
‘నవ్య’సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
దాట్ల దేవదానం రాజుగారి ‘ఇంటివంట’తో...
పడవలో.... పసందైన విందు.... భోజనం ...చిత్రాలు
దాట్ల దేవదానం రాజుగారి ‘ఇంటివంట’తో... పడవలో పసందైన భోజనం.. |
దాట్ల దేవదానం రాజుగారి ‘ఇంటివంట’తో... పడవలో పసందైన భోజనం.. |
దాట్ల దేవదానం రాజుగారి ‘ఇంటివంట’తో... పడవలో పసందైన భోజనం.. |
దాట్ల దేవదానం రాజుగారి ‘ఇంటివంట’తో... పడవలో పసందైన భోజనం.. |
‘అక్బర్’ అప్పటికప్పుడు సభావేదికపై గీసిన చిత్రం.. |
‘అక్బర్’ అప్పటికప్పుడు సభావేదికపై గీసిన చిత్రం.. |
‘అక్బర్’ అప్పటికప్పుడు సభావేదికపై గీసిన చిత్రం.. |
ప్రసంగిస్తున్న‘నవ్య’సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథశర్మ |
ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు ఆచార్య శిఖామణి... |
Blog: Designed&Maintained by:
కొత్త కమలాకరం
కొత్త కమలాకరం |
No comments:
Post a Comment